హుజురాబాద్‌లో గెలుపు బీజేపీదికాదు.. ఈటలది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-02T17:45:55+05:30 IST

హుజురాబాద్‌లో జరిగిన ఉపఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదని, కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌ని..

హుజురాబాద్‌లో గెలుపు బీజేపీదికాదు.. ఈటలది: తులసిరెడ్డి

అమరావతి: హుజురాబాద్‌లో జరిగిన ఉపఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదని, కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌ని.. ఇక్కడ గెలుపు బీజేపీది కాదని ఈటలదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఈటల బీజేపీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ  ‘నువ్వా నేనా అనే ఫైట్ వచ్చినప్పుడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే మూడో పార్టీకి స్థానముండదని’ అన్నారు. డబ్బు ప్రభావం కూడా చూపిందన్నారు. టీఆర్ఎస్ భారీ స్థాయిలో డబ్బులు పంచితే.. ఈటల తనకు తగిన స్థాయిలో పంచారన్నారు. టీఆర్ఎస్ రూ. 6వేలు పంచిందని, అయితే ఆ డబ్బులు అందరికీ చేరలేదని, కొందరు మధ్యలోనే నొక్కేసారన్నారు. ఈటల రూ. 15వందలు చొప్పన పంచారని, వంద శాతం ఓటర్‌కు చేరిందన్నారు. కాగా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, మంచి వ్యక్తని కూడా తులసి రెడ్డి అన్నారు.

Updated Date - 2021-11-02T17:45:55+05:30 IST