అమరావతి (Amaravathi): 175 అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని విజయసాయి రెడ్డి (Vijayasai reddy), సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna reddy) వ్యాఖ్యానించడం హాస్యస్పదంగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Tulasi Reddy) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 175 స్థానాలలో గెలుపు దేవుడెరుగు. ముందు సీఎం జగన్ (CM Jagan) సొంత నియోజకవర్గం పులివెందులలో గెలిస్తే అదే గొప్పని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైయస్సార్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి నిన్న తాళాలు వేశారన్నారు. పులివెందుల అసెంబ్లీ ప్లీనరీలోనే నిరసన ధ్వనులు మిన్నంటాయన్నారు. గడప గడపలో గడబిడ బస్సుయాత్ర తుస్సు మందని ఎద్దేవా చేశారు.
‘‘వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలి?.. నవరత్నాలు నకిలీ రత్నాలు అయినందుకా?.. రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్‌గా మార్చినందుకా?.. బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పేంచినందుకా?.. రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసగించి నందుకా?.. కాంట్రక్టర్లను బిక్షం ఎత్తుకునేలా చేసినందుకా?.. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా చేసినందుకా?.. వైసీపీ కార్యకర్తలనే అప్పుల పాలు చేసినందుకా?.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా?.. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినందులకా?.. ప్రత్యేక హోదా సాధించలేక పోయినందుకా?.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తునందుకా?.. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిని చూసి ఓట్లు ఎందుకు వేయాలి?’’ అని తులసి రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి