YCP ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది: Tulasi Reddy

ABN , First Publish Date - 2022-05-05T18:39:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.

YCP ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది: Tulasi Reddy

Amaravathi: వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్ కంస మేనమామ లా, శకుని మేనమామలా తయారయ్యారన్నారు. 3, 4, 5 తరగతులను ఎలిమెంటరీ విద్య నుంచి విడగొట్టి హైస్కూల్ విద్యలో కలపడం ఒక పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. దీని వలన డ్రా పౌట్స్ పెరుగుతాయన్నారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఒక చారిత్రిక తప్పిదమని అన్నారు. మాతృ భాష అయిన తెలుగు.. మృత భాష అవుతుందన్నారు. పదో తరగతి పరీక్షల్లో లీకేజీలు, మాస్ కాపింగులు నిత్య కృత్యమయ్యాయని, దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతులను హై స్కూల్ విద్యలో విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. 

Read more