వైసీపీ రైతు దుష్మన్ ప్రభుత్వం: తులసి రెడ్డి

ABN , First Publish Date - 2022-04-19T17:14:21+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై డాక్టర్ ఎన్. తులసి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వైసీపీ రైతు దుష్మన్ ప్రభుత్వం: తులసి రెడ్డి

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ, సాగునీటి రంగాలను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. వైసీపీ రైతు దుష్మన్ ప్రభుత్వమని, రైతు రుణ మాఫీ పథకం కింద రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది ప్రతి రైతుకు రూ.5 వేలు కోత పడుతోందని, రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారయ్యాయని ఆరోపించారు. 


బిందు- తుంపర సేద్యం అమలు కావడం లేదని, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టిందని తులసీ రెడ్డి విమర్శించారు.  పావలా వడ్డీ పథకానికి పాడేకట్టిందని ఎద్దేవా చేశారు. పంటల భీమా, ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో అందడంలేదన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో వైసీపీ పార్టీ, ప్రభుత్వం మాడి మసి కాక తప్పదని తులసీ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-04-19T17:14:21+05:30 IST