అక్కడ ‘టక్‌ జగదీష్‌’ సూపర్‌హిట్‌

నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీశ్‌’ వివాదాల మధ్య ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు అందరి నోట వినిపించిన మాట ఒకటే ‘ఓటీటీ విడుదల కాబట్టి ఏదోలా గట్టెక్కింది. థియేటర్లలో విడుదలై ఉంటే రిజల్ట్‌ దారుణంగా ఉండేది’ అని విమర్శించినవారే ఎక్కువ. ఇప్పుడు ఆ సినిమా మేకర్స్‌కు విమర్శల నుంచి గట్టెక్కించే అంశం బయటికొచ్చింది. బుల్లితెరపై ‘టక్‌ జగదీశ్‌’ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇటీవల వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ‘స్టార్‌ మా’ టెలికా స్ట్అయిన ఈ చిత్రం 10.89 రేటింగ్‌ వచ్చింది. దీనిని బట్టి ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ పొందినట్టే. ఈ రేటింగ్‌తో విమర్శల నుంచి ఊరట కలిగినట్టే. 
Advertisement