తూకాల్లో మోసం

ABN , First Publish Date - 2020-11-25T06:23:39+05:30 IST

పత్తి దిగుబడులను విక్రయా నికి తీసుకొచ్చిన రైతులను తూకాల్లో మోసం చేస్తున్నారు.

తూకాల్లో మోసం

  1.  ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ మిషన్‌ తేడాపై ఆగ్రహం
  2.   పరిశ్రమ ముందు రైతుల ఆందోళన 

ఆదోని(అగ్రికల్చర్‌), నవంబరు 24: పత్తి దిగుబడులను విక్రయా నికి తీసుకొచ్చిన రైతులను  తూకాల్లో మోసం చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డు సమీపంలోని భువనేశ్వరి ఇండస్ట్రీ పత్తి పరిశ్రమకు వివిధ గ్రామాలకు చెందిన 30 మంది రైతులు పత్తి దిగుబ డులు   తీసుకొచ్చారు. 30 కేజీల నుంచి క్వింటం 50 కేజీల వరకు తక్కు వకు తూయడం  రైతులు గమనించి పరిశ్రమలోని కాటా యజమానిని నిలదీశారు. తమ కాటాలో తేడా లేవని యజమాని దబాయించే ప్రయ త్నం చేశారు. దీంతో రైతులంతా ఏకమై గట్టిగా నిలదీయడమే కాకుండా పరిశ్రమ ముందు రోడ్డుపై కేవీపీఎస్‌ నాయకుడు తిక్కప్పతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పరిశ్రమ కాటా యజమాని దిగివచ్చి   ఐకే ఎలకా్ట్రనిక్‌ కాటాలో ఎంత తూకం ఉందో అంతకే ధర చెల్లిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. 

Updated Date - 2020-11-25T06:23:39+05:30 IST