ముంచేసింది

ABN , First Publish Date - 2021-09-29T05:38:08+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో ఎర్రకాలువ నిండుకుండలా ఉంది.

ముంచేసింది
తాడువాయిలో కూరగాయల తోటలో నిలిచిపోయిన నీళ్లు

తుఫాన్‌ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం


జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 28: తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో ఎర్రకాలువ నిండుకుండలా ఉంది. వరద నీటితో జలాశయం నీటి మట్టం పెరిగింది. సోమవారం ఉదయం జలాశయ నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలేశారు. మంగళవారం ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. జలాశయ సామర్ధ్యం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.83 మీటర్లు నమోదైంది. సా యంత్రం ఇన్‌ఫ్లో 8094 క్యూసెక్కులు అవుట్‌ప్లో 14,977 క్యూసెక్కులు ఉంది.

మండలంలోని తాడువాయిలో 5 ఎకరాల కూరగాయల పంట, అక్కంపేట లో మూడు ఎకరాల మిర్చి సాగు పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 500 ఎకరాల్లో వరి పంటలో నీళ్లు నిలిచిపోయింది.


పంట పొలాల్లో ఇసుక మేటలు



బుట్టాయగూడెం, సెప్టెంబరు 28: తుఫాన్‌ కారణంగా ఏజెన్సీలో పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, కాల్వలు వెంబడి గట్లు కోతకు గురికావడంతో పొలా ల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రత్తి, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయి. మంగ ళవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయాధికారులు, సహాయకులు పాలకుంట, పడమట రేగులకుంట, కేఆర్‌.పురం, విప్పలపాడు, కామయ్యకుం ట, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను, ఇసుక మేటలను పరిశీలించినట్లు ఏవో బి.సుమలత తెలిపారు. 46 ఎకరాల్లో ప్రత్తి, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

అటవీ ప్రాంతాల్లోని కొండరెడ్ల గ్రామాల రహదారులు కొట్టుకుపోయాయి. లంకపాకల నుంచి డోలుగండి మీదుగా రేపల్లె, రేగులపాడు, నిమ్మలపాడు తదితర కొండరెడ్డి గ్రామాల రోడ్డు అధ్వానమైంది.


నీటమునిగిన పునరావాస గ్రామాలు



పోలవరం, సెప్టెంబరు 28: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మండలంలో ఎల్‌ఎన్‌డీ.పేట, గోపాలపురం మండలం సాగిపాడు గ్రామాల సమీపాల్లో నిర్మించిన కోండ్రుకోట, మాదాపురం, గాజులగొంది, గ్రామాల పున రావాస కాలనీలు నీట మునిగాయి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీవో ఓ.ఆనంద్‌ నీటమునిగిన పునరావాస గ్రామాలను మంగళవారం పరి శీలించారు. వరదనీటిని తొలగించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు తీసు కోవాలని తహసీల్దార్‌ సుమతికి సూచించారు.


నష్టపోయిన రైతులను ఆదుకోవాలి



దేవరపల్లి, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి డిమాండ్‌ చేశారు. దేవరపల్లి మండ లంలో సుమారు 5వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు, కూరగాయ పంట లు ముంపునకు గురయ్యాయన్నారు. పొట్ట దశలో ఉన్న వరి మునగడంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాల న్నా రు. త్యాజంపూడిలో నీట మునిగిన ఇళ్లు, పంటపొలాలను ముప్పిడి వెంకటే శ్వరరావు పరిశీలించారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


ఎర్ర కాల్వ వరద పరిస్థితిపై ఆరా


నల్లజర్ల, సెప్టెంబరు 28: మండలలో ఎర్ర కాల్వ ఉధృతిని మంగళవారం జెసీలు హిమాన్షు శుక్లా, అంబేడ్కర్‌ పరిశీలించారు. అనంతపల్లి వద్ద నీటిమట్టం 3.50 మీటర్ల నుంచి మంగళవారం 3.20 తగ్గి నిలకడగా ప్రవహిస్తున్నట్లు ఆర్డీవో రచన, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ వివరించారు.

Updated Date - 2021-09-29T05:38:08+05:30 IST