Aug 7 2021 @ 20:51PM

Nani: ‘టక్ జగదీష్’ ఓటీటీ డీల్ ఎంతో తెలుసా?

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల అవుతుందంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.42 కోట్ల‌కు డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ట‌. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. నిజానికి కోవిడ్ సెకండ్ వేవ్ రాకుండా ఉండుంటే ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని నాని అండ్ టీమ్ భావించారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో అనుకున్న స‌మయంలో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను విడుద‌ల చేయ‌లేక‌పోయారు. ఇప్పుడు థియేట‌ర్స్ విడుద‌లైన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో థియేట‌ర్స్‌కు రావ‌డం లేదు. మ‌రో వైపు ఏపీ యాబై శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్స్ ర‌న్ అవుతున్నాయి. దీంతో నిర్మాత‌లు ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని టాక్‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.