Governor‌తో సీఎం భేటీ.. నాటకీయమే!

ABN , First Publish Date - 2021-11-29T16:54:04+05:30 IST

నీట్‌’ రద్దు కోరే తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లు ప్రభుత్వం ప్రకటించగా, కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడారని రాజ్‌భవన్‌ పేర్కొందని, ఈ భేటీ ఎందు కు జరిగిందో తెలపాలని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం

Governor‌తో సీఎం భేటీ.. నాటకీయమే!

టీటీవీ దినకరన్‌ విమర్శ

చెన్నై/పెరంబూర్: ‘నీట్‌’ రద్దు కోరే తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లు ప్రభుత్వం ప్రకటించగా, కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడారని రాజ్‌భవన్‌ పేర్కొందని, ఈ భేటీ ఎందు కు జరిగిందో తెలపాలని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం దినకరన్‌ తన ట్విట్టర్‌లో, ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎస్‌ రవితో ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు భేటీ అయ్యారు. ఆ భేటీ గురించి ప్రభుత్వం, నీట్‌పై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలుపగా, వరద నష్టాలు, కరోనా నియంత్రణ చర్యల పై ముఖ్యమంత్రితో చర్చించినట్లు రాజ్‌భవన్‌ అధికారులు ప్రకటించాయని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే ఒకే సంతకంతో నీట్‌ రద్దు చేస్తామని ప్రకటించిన డీఎంకే, ప్రస్తుతం అది సాధ్యం కాకపోవడంతో ఇలా కొత్త నాటకాలు ఆడుతోందని దినకరన్‌ విమర్శించారు.


Updated Date - 2021-11-29T16:54:04+05:30 IST