22న అంగప్రదక్షిణం టోకెన్లు జారీ

ABN , First Publish Date - 2022-08-19T06:22:32+05:30 IST

సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల వేంకటేశ్వరస్వామి అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను టీటీడీ 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది

22న అంగప్రదక్షిణం టోకెన్లు జారీ

తిరుమల, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల వేంకటేశ్వరస్వామి అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను టీటీడీ 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చు. కాగా, సెప్టెంబరులో బ్రహ్మోత్సవాల కారణంగా 27 నుంచి 30వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టోకెన్లు పొందాలని గురువారం ఓప్రకటన ద్వారా టీటీడీ కోరింది. 

Updated Date - 2022-08-19T06:22:32+05:30 IST