శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

ABN , First Publish Date - 2022-06-11T01:51:34+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

తిరుమల: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో కలసి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన జస్టిన్‌ ఎన్వీ రమణ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు వేదపండితులు ఆశ్వీర్వచనం అందజేయగా, ఆలయ డిప్యూటీఈవో లడ్డూప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

Updated Date - 2022-06-11T01:51:34+05:30 IST