ముగిసిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం

ABN , First Publish Date - 2021-08-06T21:49:18+05:30 IST

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు... 35 ఎలక్ట్రికల్ వాహనాలను లీజ్‌కు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ముగిసిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం

తిరుమల: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు... 35 ఎలక్ట్రికల్ వాహనాలను లీజ్‌కు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో రూ.6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తుల భాగస్వామ్యం, నవనీత సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-08-06T21:49:18+05:30 IST