Abn logo
Sep 23 2021 @ 03:13AM

వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే శ్రీవారి దర్శనం

  • ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు: వైవీ 


తిరుమల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని, అది లేకపోతే దర్శన సమయానికి మూడురోజుల ముందు కరోనా పరీక్షలో నెగటివ్‌ అని తేలిన సర్టిఫికెట్‌ అయినా ఉండాలని స్పష్టం చేసింది. కొవిడ్‌ నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.


26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇస్తున్న టోకెన్ల జారీని ఆపివేస్తామన్నారు. కాగా, అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24వ తేదీ ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...