వేద పారాయణదారుల పోస్టులను భర్తీ చేయండి : స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2021-07-30T00:34:07+05:30 IST

ద పారాయణ స్కీమ్ ద్వారా పారాయణదారుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు

వేద పారాయణదారుల పోస్టులను భర్తీ చేయండి : స్వరూపానందేంద్ర

తిరుమల: వేద పారాయణ స్కీమ్ ద్వారా పారాయణదారుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు శ్రీ విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సూచించారు.  వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అనేక మంది విద్యార్థులు వేద పారాయణదారుల పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వేద పరిరక్షణ కోసం ఈ పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరముందని స్వామీజీ గుర్తుచేశారు.దీనికి స్పందించిన అధికారులు త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను ఋుషికేష్ లో కలిశారు. శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని స్వామీజీకి అందజేశారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించడంలో టీటీడీ చేపడుతున్న చర్యలు ఆదర్శవంతంగా ఉన్నాయని స్వరూపానందేంద్ర స్వామి అభినందించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి కోవిడ్ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. అయితే తిరుమలలో సుందరకాండ పారాయణ గురించి టీటీడీ ప్రతినిధులు స్వామీజీ దృష్టికి తీసుకెళ్లారు. సుందరకాండ పారాయణ పూర్తవడంతో బాలకాండ పారాయణకు శ్రీకారం చుట్టామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ పారాయణ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భక్తి భావం పెరుగుతోందని టీటీడీ ప్రతినిధులు వివరించారు. 

Updated Date - 2021-07-30T00:34:07+05:30 IST