Abn logo
Sep 20 2021 @ 13:57PM

టీటీడీ జంబో పాలకమండలి నియామకంపై హైకోర్టులో పిల్‌

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జంబో పాలకమండలి నియామకంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్‌ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని, హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు. కాగా ఈ పిల్‌పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...