తిరుమల : నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 1 నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి లభించనుంది.