Abn logo
Oct 26 2021 @ 06:42AM

28న TTD కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు..

తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ జూనియర్‌, శ్రీపద్మావతి బాలికల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 28న ఉదయం 9గంటలకు ఆయా కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. టీటీడీ విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పిల్లలు.. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరుకానివారు, తిరుపతిలోని స్థానికులకు, 10-9.7 జీపీఏ ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 9.6 జీపీఏ కన్నా తక్కువ ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారన్నారు. ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, కళాశాలల్లో సీట్లు మాత్రమే కావాల్సిన వారు ధ్రువీకరణ పత్రాలు, ఫీజులతో నేరుగా స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption