గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారి ప్రసాదం: TTD chairman

ABN , First Publish Date - 2022-04-15T16:46:19+05:30 IST

నెయ్యి తయారీ కేంద్రం భూమి పూజలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారి ప్రసాదం: TTD chairman

తిరుపతి: నెయ్యి తయారీ కేంద్రం భూమి పూజలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే ఒకటి నుంచి గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు స్వామి ప్రసాదంలో వినియోగిస్తున్నామని తెలిపారు. మూడు కోట్ల రూపాయల విరాళంతో దేశవాళీ గోవుల పాలు నుంచి రోజుకు 60 కేజీల నెయ్యి తయారీ కేంద్రం శంకుస్థాపన చేశామన్నారు. తిరుమలలో కూడా వంద దేశీ ఆవులు శ్రీవారి సేవలో ఉంటాయని తెలిపారు. టీటీడీ ఆధునిక డైరీ కోసం వంద కోట్లు విరాళం ఇవ్వటానికి భక్తులు సిద్ధంగా ఉన్నారని... 8 నెలల్లో డైరీ పూర్తి చేస్తామని వెల్లడించారు. స్లాటెడ్ సర్వ దర్శనం తీసేయాలని రెండు నెలలుగా అనుకుంటున్నామని చెప్పారు. మొన్న విజిలెన్స్, టీటీడీ సిబ్బంది లోపం వల్ల తోపులాట సంఘటన చోటు చేసుకుందన్నారు. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఆ రోజు ఆహారం ఇవ్వకపోవడం కూడా ఒక కారణమన్నారు. నడకదారి భక్తులకు దివ్యదర్శనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. 

Updated Date - 2022-04-15T16:46:19+05:30 IST