Abn logo
Sep 26 2021 @ 02:05AM

టీటీడీ నూతన జేఈవోగా వీరబ్రహ్మయ్య బాధ్యతల స్వీకరణ

తిరుమల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుపతి నూతన జేఈవోగా వి.వీరబ్రహ్మయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో ఆయన బాధ్యతలు చేపట్టి, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ డిప్యూటీ ఈవో రమే్‌షబాబు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్‌ బుక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ.. టీటీడీ నిబంధనల మేరకు విధులు నిర్వహించే శక్తి తనకు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు.