న్యూజెర్సీలో TTA సంబరాలకు భారీగా ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2022-05-27T21:14:16+05:30 IST

తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటలోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు.

న్యూజెర్సీలో TTA సంబరాలకు భారీగా ఏర్పాట్లు!

తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పాటలోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ‘TNI’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను, కార్యక్రమాలను వివరించారు. న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో 27వ తేదీ రాత్రి బ్యాంక్ వెట్ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.


ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు. అనంతరం కోటి బృందంచే మ్యూజికల్ నైట్ ఉంటుందని పేర్కొన్నారు. 28వ తేదీ ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్యం గీతం ఉంటుందన్నారు. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రూపొందించారని వందేమాతరం శ్రీనివాస్ ఆలపిస్తారని తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మరఫీ, స్థానిక సెనేటర్ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం సాయంత్రం ప్రముఖ సింగర్ సునీత బృందంచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. రసమయి బాలకిషన్ బృందం ప్రదర్శన ఉంటుందన్నారు. సినిమా నటీనటులు నిఖిల్, రితూ వర్మ, అంజలి, జబర్దస్త్ బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.


మూడవరోజు ఉదయం వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణాన్ని తమ వేడుకల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు ప్రముఖ యాంకర్లు సుమా, రవి యాంకరింగ్ చేస్తారని శ్రీనివాస్ గనగొని, మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, భాజపా నేతలు డి .అరవింద్, డీకే అరుణ, వి వివేక్ స్వామి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు.


కాన్ఫరెన్స్‌కు అనుబంధంగా వాణిజ్యం, ఐటీ, మహిళ, రాజకీయం, యువత, మ్యాట్రిమోనీ తదితర సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రముఖ అటార్నీలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. TTA స్టార్ సింగర్‌ను ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తామని చెప్పారు. యువత కోసం క్రూజ్ పర్యటన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ వైభోగం సాంప్రదాయం చాటిచెప్పే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.


ఈ మెగా కన్వెన్షన్‌ కోసం కమిటీలను నియమించినట్లు టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ తెలిపారు. ఈ కన్వెన్షన్‌కు కన్వీనర్‌గా శ్రీనివాస్‌ గనగోని వ్యవహరిస్తున్నారు. కన్వెన్షన్‌ అడ్వయిజరీ కమిటీలో టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి, డా. విజయ్‌పాల్‌ రెడ్డి, డా. హరనాథ్‌ పొలిచెర్ల, డా. మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ ఉన్నారు. బాంక్వెట్‌ కమిటీకి ఉషా చింత చైర్‌గా వ్యవహరిస్తున్నారు, బడ్జెట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటికీ పవన్‌ కె రవ్వ చైర్‌గా వ్యవహరిస్తున్నారు. బిజినెస్‌ ఫోరం కమిటీకి మాణిక్యం చైర్‌గా, సిఇ`సిఎంఇ కమిటీకి డా. సునీత కనుమూరి చైర్‌గా, సెలబ్రిటీస్‌‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి మహేష్‌ సంబు చైర్‌గా, కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌ కమిటీకి వెంకట్‌ ఎక్కా అడ్వయిజర్‌గా ఉన్నారు. కల్చరల్‌ కమిటీకి అశోక్‌ చింతకుంట చైర్‌గా వ్యవహరిస్తున్నారు.


డెకరేషన్‌ కమిటీకి దీప జలగం అడ్వయిజర్‌గా ఉన్నారు. ఫుడ్‌ కమిటీకి విజయ్‌ భాస్కర్‌ చైర్‌గా, ఫండ్‌ రైజింగ్‌ కమిటీకి సురేష్‌ వెంకన్నగారి, హాస్పిటాలిటీ కమిటీకి శివారెడ్డి కొల్లా, ఇమ్మిగ్రేషన్‌ ఫోరం కమిటీకి అజయ్‌ రెడ్డి చైర్‌గా, మెట్రిమోనియల్‌ కమిటీకి సురేష్‌కుమార్‌ తండా చైర్‌గా, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ కమిటీకి ఎల్ఎన్ నర్సింహా రెడ్డి, విలాస్‌ జంబుల చైర్‌గా/ కో చైర్‌గా , ఓవర్సీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీకి నవీన్‌ గోలి అడ్వయిజర్‌గా ఉన్నారు. పొలిటికల్‌ ఫోరం కమిటీకి సతీష్‌ మేకల చైర్‌గా, ప్రోగ్రామ్‌ అండ్‌ ఈవెంట్స్‌ కమిటీకి సుధాకర్‌ ఉప్పల, రిసెప్షన్‌ కమిటీకి కిరణ్‌, రిజిస్ట్రేషన్‌ కమిటీకి రూపక్‌ కల్లూరి చైర్‌గా వ్యవహరిస్తున్నారు. సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీకి అరుణ్‌ చైర్‌గా, సావనీర్‌ కమిటీకి శ్రీనివాస్‌ గూడూరు, ఆధ్యాత్మిక కమిటీకి రామకృష్ణ సన్నిధి, ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిటీకి రామ్మోహన్‌ చిన్నల, వెండర్‌ అండ్‌ ఎగ్జిబిట్స్‌ కమిటీకి నరేష్‌ చింతలచెరువు చైర్‌గా ఉన్నారు. వలంటీర్‌ కమిటీకి రంగారావు చైర్‌గా, వెబ్‌ కమిటీకి నరేందర్‌ రెడ్డి చైర్‌గా, ఉమెన్స్‌ ఫోరం కమిటీకి సంగీతారెడ్డి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.


తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA ) ఉత్సవాల వివరాలు ఈ లింక్ ద్వారా చూడవచ్చు

Updated Date - 2022-05-27T21:14:16+05:30 IST