వంద పెట్టు.. రోజంతా Hyderabad City లో షికారు కొట్టు..!

ABN , First Publish Date - 2021-11-03T17:29:18+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో

వంద పెట్టు.. రోజంతా Hyderabad City లో షికారు కొట్టు..!

  • లీటర్‌ పెట్రోల్‌ ధరకంటే చవకగా ప్రయాణం 
  • ట్రావెల్‌-24 టికెట్‌తో ప్రయాణికులకు ప్రయోజనం
  • టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌


హైదరాబాద్‌ సిటీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెల్‌ 24 టికెట్‌పై ఆర్టీసీ వినూత్న ప్రచారం చేపట్టింది. వంద రూపాయలకే లభ్యమయ్యే ఈ టికెట్‌తో ప్రయాణికులు 24గంటల పాటు నగరంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ టికెట్‌పై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు   ఉన్నతాధికారులు, డిపోమేనేజర్లు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 


రెట్టింపు చేయడమే లక్ష్యం..

ప్రయాణికులు రూ.100లతో  ట్రావెల్‌ 24 టికెట్‌(టీ-24) తీసుకొని రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణాలు చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు. ఈ సేవలను ప్రయాణికులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ టికెట్‌ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు గ్రేటర్‌జోన్‌ వ్యాప్తంగా సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రోఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో తిరిగే వీలుంటుందన్నారు. గ్రేటర్‌లో ప్రతిరోజూ 29 డిపోల పరిధిలో సుమారు 6 వేల వరకు ట్రావెల్‌ 24 టికెట్లు ప్రయాణికులు తీసుకుంటుండగా వీటిని రెట్టింపుచేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

Updated Date - 2021-11-03T17:29:18+05:30 IST