ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-07-25T08:23:32+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల (టీఎ్‌సఆర్‌జేసీ) ప్రవేశ పరీక్ష ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌...

ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల (టీఎ్‌సఆర్‌జేసీ) ప్రవేశ పరీక్ష ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు  రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ తెలిపారు. ఆగస్టు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష  ఉంటుంది. పరీక్ష కేంద్రాలను అన్ని జిల్లా కేంద్రాల్లో  ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్ధులు ఆగస్టు 9 నుంచి ఆన్‌లైన్‌ జ్ట్టిఞ://్టటట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీుఽ లో తమ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రమణకుమార్‌ చెప్పారు. 


Updated Date - 2021-07-25T08:23:32+05:30 IST