జీవో 317ను రద్దు చేయాలని టీఎస్పీటీఏ డిమాండ్

ABN , First Publish Date - 2022-01-05T14:44:06+05:30 IST

ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో317 ను గుర్తింపు పొందిన 8 సంఘాల నేతల ఆమోదంతోనే జారీ చేశారని చెప్పడం హాస్యాస్పదంగా...

జీవో 317ను రద్దు చేయాలని టీఎస్పీటీఏ డిమాండ్

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో317 ను గుర్తింపు పొందిన 8 సంఘాల నేతల ఆమోదంతోనే జారీ చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(టి.ఎస్.పి.టి.ఎ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, నాగనమోని చెన్నరాములు ఆరోపించారు.317 జారీ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు ప్రభుత్వ అనుకూల సంఘాల నాయకులతో మాత్రమే మాట్లాడారని వారు పేర్కొన్నారు.జీఓ విడుదల అయిన తరువాత ఉత్పన్నం అయిన వివిధ సమస్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత డిసెంబర్13 న గుర్తింపు పొందిన 8 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆరు గంటల పాటు సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు సమర్పించిన సవరణ ప్రతిపాదనలను బుట్ట దాఖలు చేశారని వారు విమర్శించారు. 


ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీఓ.317 ను రద్దు చేసి, తన తప్పును సరిదిద్దు కోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను విభజనకు ఉత్తర భారతానికి చెందిన అధికారి కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారుల సూచనలను తీసుకుని ఉద్యోగుల స్థానికత ఆధారంగా పునర్ విభజన చేయడానికి ఆదేశాలు జారీ చేయాలని టీఎస్పీటీఏ సంఘ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-01-05T14:44:06+05:30 IST