Abn logo
Sep 1 2021 @ 20:13PM

గత నీటి కేటాయింపులు తాత్కాలికం: రజత్‌కుమార్

హైదరాబాద్: కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ లేఖ రాశారు. కృష్ణా నదీ జలాలపై జరిగిన గత నీటి కేటాయింపులు తాత్కాలికమని రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు 2015-16కి  మాత్రమే వర్తిస్తాయని రజత్‌కుమార్ తెలిపారు. ట్రిబ్యూనల్‌లో తమకు న్యాయమైన కేటాయింపులు జరుగుతాయన్న ఆశాభావంతో తాత్కాలిక ఒప్పందం చేసుకున్నామని రజత్‌కుమార్ పేర్కొన్నారు. 2018 నుంచే  కృష్ణా నదీ జలాల్లో 50:50 పంపకాల కోసం తెలంగాణ డిమాండ్‌ చేస్తున్నాదని రజత్‌కుమార్ తెలిపారు. 


క్రైమ్ మరిన్ని...