TS News: క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత: రాచకొండ సీపీ

ABN , First Publish Date - 2022-09-23T22:31:04+05:30 IST

Hyderabad: హైదరాబాద్‌లో మూడేళ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్‌ జరుగుతుండడంతో 2,500 మంది పోలీసు సిబ్బందిని భద్రతగా ఉంచుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ (Mahesh Bhagavath) తెలిపారు. 300 సీసీ కెమెరాలను బిగించామని, మ్యాచ్‌పై ఇంటిలిజెన్స్‌ (Intelligence) పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. నిఘా విభాగంతో షి టీమ్స్ కూడా పనిచేస్తాయన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై నిఘా ఉంటుందని, బ్లాక్‌లో టికెట్స్ అమ్మే వారి సమాచారం తమకు తెలపాలని కోరారు. మ్యాచ్ జరిగే రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలిపారు.

TS News: క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత: రాచకొండ సీపీ

Hyderabad: క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం నిన్నటి రోజున జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాట.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. మ్యాచ్ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. మ్యాచ్ పూర్తయ్యేవరకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో మూడేళ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్‌ జరుగుతుండడంతో 2,500 మంది  పోలీసు సిబ్బందిని భద్రతగా ఉంచుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ (Mahesh Bhagavath) తెలిపారు. 300 సీసీ కెమెరాలను బిగించామని, మ్యాచ్‌పై ఇంటిలిజెన్స్‌ (Intelligence) పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. నిఘా విభాగంతో షి టీమ్స్ కూడా పనిచేస్తాయన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై నిఘా ఉంటుందని, బ్లాక్‌లో టికెట్స్ అమ్మే వారి సమాచారం తమకు తెలపాలని కోరారు. మ్యాచ్ జరిగే రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు నడుస్తాయని  తెలిపారు.

Updated Date - 2022-09-23T22:31:04+05:30 IST