జరపడం చట్ట వ్యతిరేకమే: ఎన్‌ఆర్‌ఏఐ

ABN , First Publish Date - 2022-09-23T08:45:08+05:30 IST

జరపడం చట్ట వ్యతిరేకమే: ఎన్‌ఆర్‌ఏఐ

జరపడం చట్ట వ్యతిరేకమే: ఎన్‌ఆర్‌ఏఐ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఓపెన్‌ ఫైర్‌ చేయడం చట్ట వ్యతిరేకమేనని న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) స్పష్టం చేసింది. ఆగస్టు 13న మహబూబ్‌నగర్‌లో విధుల్లో ఉన్న పోలీసు రైఫిల్‌ను తీసుకుని మంత్రి గాల్లోకి కాల్పులు జరపడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రాబిన్‌ జెక్యూస్‌ అనే వ్యక్తి ఎన్‌ఆర్‌ఏఐకి సహ చట్టం ప్రకారం దరఖాస్తు చేసి ఎన్‌ఆర్‌ఏఐలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సభ్యత్వం, ఇతర వివరాలు అందించాలని కోరారు. దీనికి సంస్థ గురువారం సమాధానమిచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌ 2021 ఫిబ్రవరిలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నారని, తమ సంస్థలో సభ్యత్వం ఉన్నంత మాత్రాన గాల్లోకి కాల్పులు జరిపే అధికారం ఉండదని తెలిపింది. పోలీసుల తుపాకీతో ప్రజల మధ్యలో గాల్లోకి కాల్పులు జరపడం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. 

Updated Date - 2022-09-23T08:45:08+05:30 IST