జోనల్‌ స్థాయి క్రీడలు వాయిదా వేయండి

ABN , First Publish Date - 2022-09-23T08:41:55+05:30 IST

జోనల్‌ స్థాయి క్రీడలు వాయిదా వేయండి

జోనల్‌ స్థాయి క్రీడలు వాయిదా వేయండి

గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విజ్ఞప్తి


బతుకమ్మ పండుగను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్ధులు, ఉపాధ్యాయులు జరుపుకునేందుకు వీలుగా అదే రోజు(ఈ నెల 25న) ప్రారంభం అవుతున్న గురుకుల జోనల్‌ క్రీడా పోటీలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. బతుకమ్మ పండగ ముందురోజున క్రీడాకారులు రిపోర్ట్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. బతుకమ్మ పండుగ రోజే ప్రారంభమై మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల మహిళా సిబ్బంది పండుగ జరుపుకునే అవకాశం కోల్పోతున్నారని సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్‌ వెల్లడించారు.

Updated Date - 2022-09-23T08:41:55+05:30 IST