బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ, బీపీటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-09-23T08:20:39+05:30 IST

బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ, బీపీటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ, బీపీటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిపికేషన్‌ జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 ఉదయం 9 గంటల నుంచి అక్టోబరు 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫారం నింపేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే 9392685856, 7842542216, 9059672216 నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. నిబంధనలు తెలుసుకునేందుకు 9490585796, 8500646769 నంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఫోన్‌ చేయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruh.telangana.gov.inను సందర్శించవచ్చని తెలిపారు.

Updated Date - 2022-09-23T08:20:39+05:30 IST