పదోన్నతుల్లో రిజర్వేషన్లు చెల్లవు!

ABN , First Publish Date - 2022-09-23T08:07:34+05:30 IST

పదోన్నతుల్లో రిజర్వేషన్లు చెల్లవు!

పదోన్నతుల్లో రిజర్వేషన్లు చెల్లవు!

ప్రతిభ, సీనియారిటీనే ప్రామాణికం

అగ్గి రాజేస్తున్న జెన్‌కో నిర్ణయం


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పదోన్నతులకు ప్రతిభ, సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటామని, రిజర్వేషన్లు చెల్లవని తెలంగాణ జెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులు..విద్యుత్తుసంస్థల్లో అగ్గి రాజేస్తున్నాయి. 2009 నుంచి జరిగిన నియామకాలకూ సీనియారిటీని వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌వోఆర్‌) ప్రకా రం 50 మందికి పదోన్నతులు కల్పిస్తే... అందులో ఒకరిద్దరైనా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉంటారు. మెరిట్‌ కమ్‌ సీనియారిటీని అమలు చేసే క్రమంలో 50 మందికి పదోన్నతులు ఇవ్వాలనుకుంటే ప్రతిభ ఆధారం గా సీనియారిటీ జాబితాలో ముందున్న వారికే ఎక్కువ అవకాశాలుంటాయి. ఇదే ప్రస్తుతం వివాదానికి కారణమవుతోంది. వాస్తవానికి ఇప్పటి దాకా విద్యుత్తు సంస్థల్లో ప దోన్నతులకు రోస్టర్‌ కమ్‌రిజర్వేషన్‌(ఆర్‌వోఆర్‌)నే ప్రామా ణికంగా తీసుకుంటున్నారు. పలు సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో సీనియారిటీపై స్పష్టత ఇవ్వాలని ఇంధనశాఖ కు జెన్‌కో లేఖ రాయగా... తాము మెరిట్‌ కమ్‌ సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటున్నందున... అదే అమ లు చేసుకోవాలని గతఏడాది మే 29న ఉత్తర్వులు ఇచ్చిం ది. ఈ మేరకు జెన్‌కోతోపాటు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశాయి. ఇదే గనుక అ మలు చేస్తే తమకు పదోన్నతులు రావని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రోస్టర్‌తో ముడిపడి ఉండే అన్ని శాఖలకు ఎస్సీ అభివృద్ధి శాఖ నోడల్‌ డిపార్ట్‌మెంట్‌. ఆ శాఖతో సంప్రదింపుల త ర్వాతే రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ ఆఫ్‌ సీనియారిటీ జాబితాపై నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇంధన శాఖ మాత్రం ఆ పని చేయకుండా ఏకపక్షంగా జెన్‌కోకు స్పష్టత/వివరణ ఇచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, మెరిట్‌ కమ్‌ సీనియారిటీ ప్రాతిపదికన తయారుచేసిన జాబితాలు అమలు చేయరాదని, వాటిని పక్కన పెట్టాల్సిందేనని ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సం ఘం డిమాండ్‌ చేస్తోంది. జెన్‌కో, డిస్కమ్‌ల నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యుత్‌సౌధలో నిరసన చేపట్టనుం ది. జెన్‌కో, డిస్కమ్‌ల నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ తర్వాత రిలే, అమరణ నిరాహారదీక్షలు చేస్తామని ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యాంమనోహర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-23T08:07:34+05:30 IST