Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 02:47:11 IST

పీఎఫ్‌ఐపై నిషేధం?

twitter-iconwatsapp-iconfb-icon

ఆ సంస్థ హింసాత్మక చర్యలతో ప్రజల మనసులపై ప్రత్యక్ష ప్రభావం

ఎన్‌ఐఏ తాజా ప్రకటనలో ఆందోళన


పీఎ్‌ఫఐపై వస్తున్న ఆరోపణలు, ఎదుర్కొంటున్న కేసులు, తాజా దాడుల నేపథ్యంలో ఆ సంస్థపై త్వరలో నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ సంస్థ గురించి ఎన్‌ఐఏ గురువారం విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘పీఎ్‌ఫఐపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. ఆ సంస్థ సభ్యులు, నాయకులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేరళలో ఒక కాలేజీ ప్రొఫెసర్‌ చేతిని నరకడం, ఇతర మతాలకు చెందిన సంస్థల నేతల కిరాతక హత్యలు, ప్రముఖ వ్యక్తులు, స్థలాల్లో పేలుళ్లకు అవసరమైన ముడిపదార్థాలు సేకరించడం, ఇస్లామిక్‌ స్టేట్‌ను సమర్థించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి చర్యలకు వారు పాల్పడ్డారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో భయోత్పాతాన్ని కలిగించే విధంగా ప్రత్యక్ష ప్రభావం చూపాయి’’ అని ఎన్‌ఐఏ తన ప్రకటనలో వివరించింది. పైన పేర్కొన్న కేసులన్నింటిలో కలిపి ఎన్‌ఐఏ 45 మందిని కోర్టుల్లో దోషులుగా తేల్చినట్లు, 355 మంది పేర్లను అభియోగపత్రాల్లో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధానికి గురైన పీఎ్‌ఫఐపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఒక కేసు విచారణ సందర్భంగా గత ఏడాదే సుప్రీంకోర్టుకు కూడా తెలిపారు. 2018 జనవరిలో కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు కూడా పీఎ్‌ఫఐపై నిషేధం ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా 2019 డిసెంబరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో.. పీఎ్‌ఫఐను నిషేధించాలంటూ యూపీ సర్కారు కూడా కేంద్రానికి ప్రతిపాదించింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.