Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

TS News: పేర్లు మార్చడం సరికాదు: షర్మిల

twitter-iconwatsapp-iconfb-icon
TS News: పేర్లు మార్చడం సరికాదు: షర్మిల

Hyderabad: ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ (YSR) హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పేరు మార్పును టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandra babu Naidu), బీజేపీ నాయకురాలు పురంధేశ్వరీ, సినీ నటుడు జూ. ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) కూడా జగన్ నిర్ణయం సరైంది కాదన్నారు. ఎన్టీఆర్ లాంటి పెద్దమనిషిని అవమానిస్తే.. కోట్లాది మంది ప్రజలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు.. రేపు వచ్చే ప్రభుత్వం.. మళ్లీ పేరు మారిస్తే వైఎస్సార్‌ను అవమానించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.