జీనోమ్‌ వ్యాలీలో ‘బయోలాజికల్‌ ఈ’ కొత్త ప్లాంట్‌

ABN , First Publish Date - 2020-02-18T09:31:01+05:30 IST

హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో కొత్త ప్లాంట్‌ను బయోలాజికల్‌ ఈ (బీఈ) ఏర్పాటు చేసింది. దీన్ని తెలంగాణ పరిశ్రమలు

జీనోమ్‌ వ్యాలీలో  ‘బయోలాజికల్‌ ఈ’ కొత్త ప్లాంట్‌

  • రూ.300 కోట్ల పెట్టుబడి.. 1,000 మందికి ఉపాధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో కొత్త ప్లాంట్‌ను బయోలాజికల్‌ ఈ (బీఈ) ఏర్పాటు చేసింది. దీన్ని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు  చారు. దీంతోపాటు మార్కెట్‌లోకి కంపెనీకి చెందిన కొత్త టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనకు తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని, ఇందుకు లైఫ్‌ సైన్సెస్‌ రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతోందని కేటీఆర్‌ అన్నారు. బయోఏషియా 2017 సమయంలో ఈ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశానని.. బయోఏషియా 2020కి దీన్ని ప్రారంభించడం ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే  జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్ల తయారీకి కంపెనీకి ప్లాంట్‌ ఉందని బయోలాజికల్‌ ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల చెప్పారు. దాదాపు 29 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌ వల్ల దాదాపు 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 


కొత్త వ్యాక్సిన్‌ తయారీకి అనుమతి

ఇటీవలే కొత్త టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ తయారీ, మార్కెటింగ్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) నుంచి బయోలాజికల్‌ ఈ లైసెన్స్‌ పొందింది. జీఎ్‌సకే వ్యాక్సిన్స్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌తో కలిసి ఈ వ్యాక్సిన్‌ను బీఈ అభివృద్ధి చేసింది. వ్యాక్సిన్‌ భద్రత, ఎఫికాసీని పరిశీలించి సీడీఎ్‌ససీఓ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని జీఎంపీ తయారీ ప్రమాణాలు కలిగిన కంపెనీ సదుపాయాల్లో దీన్ని తయారు చేస్తారు. 

Updated Date - 2020-02-18T09:31:01+05:30 IST