సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం

ABN , First Publish Date - 2022-01-18T23:06:36+05:30 IST

కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్‌ ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టింగ్ ఇవ్వకుండానే జీతాలు ఇస్తున్నారని ..

సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం

హైదరాబాద్: కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్‌ ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టింగ్ ఇవ్వకుండానే జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయకుంటే మార్చి 14న హాజరుకావాలని ఆదేశించింది. పనిచేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృధా అయినట్లేనని వ్యాఖ్యానించింది. అసలు వెయిటింగ్‌లో ఎంతమంది ఉన్నారని,  ప్రభుత్వ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పిల్‌పై విచారణ మార్చి 14కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-18T23:06:36+05:30 IST