కరోనాతో భయపడుతుంటే ఎగ్జిబిషన్ కావాలా.. హైకోర్టు

ABN , First Publish Date - 2022-01-04T23:03:25+05:30 IST

రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా

కరోనాతో భయపడుతుంటే ఎగ్జిబిషన్ కావాలా.. హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా దృష్ట్యా ఇంట్లోంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే ఎగ్జిబిషన్ కావాలా అని హైకోర్టు ప్రశ్నించింది.  నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 2019 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ను నిలిపివేయడం సమంజసం కాదని ఎగ్జిబిషన్ సొసైటీ పేర్కొ్ంది. థియేటర్లు, మాల్స్‌కు లేని ఆంక్షలు ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారని సొసైటీ వాదించింది. కరోనా దృష్ట్యా ఇంట్లోంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే ఎగ్జిబిషన్ కావాలా అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పరిస్థితుల్లో ఎగ్జిబిషన్‌ కొనసాగాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఫైర్, పోలీసులు, జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకోవాలంటూ జీవో ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందతి. ప్రభుత్వ వివరణతో పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. 

Updated Date - 2022-01-04T23:03:25+05:30 IST