హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాఖలైన పిల్‌ను హైకోర్టును కొట్టివేసింది. క్రమబద్ధీకరణకు 2016లో తెలంగాణ ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. జీవో 16పై 2017లో నిరుద్యోగి జె.శంకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీవోపై గతంలో స్టే ఇవ్వడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. క్రమబద్ధీకరణపై సీజే సతీష్‌చంద్రశర్మ ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది.