కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-11-14T22:34:56+05:30 IST

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి: బండి సంజయ్

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి: బండి సంజయ్

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతోన్న బంజారా ఉత్సవ్ లో బండి సంజయ్, ఈటల తదితరులు పాల్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ తండాల్లో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని బండి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు కోసం పోరాడిన రవీంద్ర నాయక్ ను కేసీఆర్ అవమానించాడని బండి సంజయ్ మండిపడ్డారు. గిరిజనులను వేదిస్తోన్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని సంజయ్ అన్నారు. పోడు భూముల కోసం పోరాటం చేసింది బీజేపీ మాత్రమే అని, కొమరం భీం, ఠాణు నాయక్ చరిత్రను తెరమరగు చేసే ప్రయత్నం జరుగుతుందని బండి విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాకనే తండాల్లో టాయిలెట్స్ కట్టించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2021-11-14T22:34:56+05:30 IST