కేబినెట్‌ ఆమోదించాకే టీఎస్‌ బీపాస్‌ అమలు

ABN , First Publish Date - 2020-05-31T08:45:13+05:30 IST

లేఅవుట్‌, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు ఇచ్చే టీఎస్‌ బీపాస్‌ ను... రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తరువాతనే అమలు చేస్తామని మునిసిపల్....

కేబినెట్‌ ఆమోదించాకే టీఎస్‌ బీపాస్‌ అమలు

అరవింద్‌ కుమార్‌ వెల్లడి


హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు ఇచ్చే టీఎస్‌ బీపాస్‌ ను... రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తరువాతనే అమలు చేస్తామని మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం కొన్నిచోట్ల అమలవుతున్నది ప్రయోగాత్మకంగా మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘2నుంచి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పూర్తిస్థాయిలో టీఎస్‌ బీపాస్‌ అమలుచేయాలని నిర్ణయించాం. కానీ, కేబినెట్‌ ఆమోదం తరువాతే అమలులోకి వస్తుంది’’అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ పురోగతిలో ఉందన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధాన ప్రక్రియతోపాటు ప్రభుత్వ స్థలాలు, నిషేధిత సర్వే నంబర్ల వివరాలను పొందుపరిచే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. వాస్తవానికి టీఎస్‌ బీపా్‌సను ఏప్రిల్‌ 2నుంచే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించినా కరోనా కారణంగా జాప్యమైంది. 

Updated Date - 2020-05-31T08:45:13+05:30 IST