Abn logo
Sep 15 2020 @ 03:40AM

కరీంనగర్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ మృతి

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 14: కరీంనగర్‌ జిల్లా జైలులో ఓ రిమాండ్‌ ఖైదీ మరణించాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంబు కొంరయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతణ్ని ఈనెల 10న కరీంనగర్‌ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కొంరయ్య తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంరయ్య అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement