Abn logo
Jan 28 2021 @ 02:07AM

ఇలా చేసి చూడండి!

బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గినట్టనిపిస్తే పది నుంచి 15  దాకా ఎండుద్రాక్షలు తింటే మంచిది. 

 కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే తొందరగా పాడవదు.

మూడు క్యారట్లు తింటే మూడు మైళ్లు నడవగల ఎనర్జీ శరీరానికి వస్తుంది.

 సాయంత్రం ఐదు తర్వాత చిరుతిళ్లు తినడం మంచిది కాదు. దానికి బదులు సాయంత్రం ఏడు గంటల కల్లా మితాహారం తీసుకోవాలి.

బీట్‌రూట్‌ దుంపల్లో ఐరన్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ గ్లాసుడు బీట్‌ రూట్‌ రసం తాగితే శరీరంలో రక్తప్రసరణ బాగా జరగడమే కాకుండా చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.

అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూను తేనె వేసి బాగా కలిపి ఆ నీటిని పరగడుపున తాగితే ఎసిడిటీపై బాగా పనిచేస్తుంది. 

క్యారెట్‌ జ్యూస్‌ లేదా క్యారెట్‌  సూప్‌ తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నువ్వులనూనె, నిమ్మరసం కలిపిన  మిశ్రమంతో కీళ్లపై మర్దనా చేస్తే కూడా నొప్పులు తగ్గుతాయి.  చేపలు, నట్స్‌, బ్లూబెర్రీస్‌, వెల్లుల్లి, జామ, నారింజపండ్లను తింటే కీళ్ల బాధలు ఉండవు.

చింతపండు నానబెట్టి ఆ గుజ్జును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై  రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి వలయాలు పోతాయి. 

Advertisement
Advertisement
Advertisement