troubled by cold and cough: పిల్లలు జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే ఈ హోం రెమిడీస్ ట్రై చేయండి..?

ABN , First Publish Date - 2022-09-28T16:41:16+05:30 IST

పిల్లలు తరచుగా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. కాస్త వాతావరణం మారినా, తాగే నీరులో మార్పు కనిపించినా పిల్లల్లో జలుబు లక్షణాలు పెరుగుతాయి.

troubled by cold and cough: పిల్లలు జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే ఈ హోం రెమిడీస్ ట్రై చేయండి..?

పిల్లలు తరచుగా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. కాస్త వాతావరణం మారినా, తాగే నీరులో మార్పు కనిపించినా పిల్లల్లో జలుబు లక్షణాలు పెరుగుతాయి. ఇలా చెప్పాపెట్టకుండా దాడిచేసిపోయే జలుబు, దగ్గుతో విసిగిపోయే తల్లిదండ్రులు చక్కని హోం రెమిడీస్ ని ఫోలో అయ్యి ఉపశమనాన్ని కలిగించవచ్చు అదేలాగంటే....


జలుబు, దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే దానికి అనేక ఇన్పెక్షన్లు కారణం కావచ్చు. 


1. తేనె అల్లరసం...

పిల్లల్లో జలుబు లక్షణాలు కనిపించినపుడు ఖచ్చితంగా తేనె అల్లంరసం ఇవ్వాలి. 1 టీస్పూన్ అల్లం రసాన్ని రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనితో పాటు గోరువెచ్చని నీరు కూడా తీసుకోవాలి. 


2. లవంగాలు, తులసి ఇవ్వండి.

పిల్లలు పొడి దగ్గుతో బాధపడుతుంటే.. లవంగాలు తులసి కలిపి ఇవ్వండి. లేదా తేనె కలిపి తినిపించండి. లవంగాలను తక్కువ సెగమీద వేయించి చూర్ణం చేసుకోవాలి. ఇది దగ్గు, జలుబుకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఇవ్వాలి. 


3. ఎండు అల్లం పొడి లేదా శొంఠి..

శొంఠి ని తేనెలో రంగరించి కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. దీనిలోకి పిప్పళ్ళను కలిపి కూడా ఇవ్వవచ్చు. ఈ చూర్ణాన్ని చిటికెడు పాలలో కలిపి పిల్లలకు రోజూ ఇవ్వాలి. 

Updated Date - 2022-09-28T16:41:16+05:30 IST