ఆలయంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2022-08-09T04:10:37+05:30 IST

మండలంలోని కొమరిక గ్రామంలో ఉన్న పోలేరమ్మ ఆలయం వద్ద సోమవారం దొంగతనానికి విఫలయత్నం జరిగింది.

ఆలయంలో చోరీకి విఫలయత్నం

ఇందుకూరుపేట, ఆగస్టు 8 : మండలంలోని కొమరిక గ్రామంలో ఉన్న పోలేరమ్మ ఆలయం వద్ద సోమవారం దొంగతనానికి విఫలయత్నం జరిగింది. చోరీ యత్నంపై పోలీసులకు ఫిర్యాదు  చేసినట్లు దేవస్థానం పూజారి శాస్త్రి తెలిపారు. స్థానిక పోలీసులు సీసీ కెమెరాల్లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలించి త్వరలో దొంగని పట్టుకుంటామని తెలిపారు. గతంలో ఇదే ఆలయంలో రెండుసార్లు దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్థులు వాపోయారు. 

 ఫ కొమరిక గ్రామ హరిజనవాడలోని మాతమ్మ ఆలయంలో ఇటీవల హుండీ దొంగతనం జరిగినట్లు అక్కడ వాసులు తెలిపారు. హుండీలో సుమారు రూ.7వేల వరకు సొమ్ము ఉన్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-09T04:10:37+05:30 IST