కావలసినవి: పాలు - అర లీటరు, అగర్ అగర్ స్ట్రిప్స్ - 5 గ్రాములు, ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొద్దిగా, గ్రీన్ కలర్ - కొద్దిగా, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, ఆరెంజ్ ఎసెన్స్ - అర టీస్పూన్, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్.
తయారీ: అగర్ అగర్ స్ట్రిప్స్‌ని నీళ్లలో కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాత్ర పెట్టి పాలు, పంచదార వేసి మరిగించాలి. మరొక పాత్రను స్టవ్‌పై పెట్టి కొద్దిగా నీళ్లు పోసి అగర్ అగర్ స్ట్రిప్స్ వేయాలి. పావు గంట పాటు మరిగించుకుంటే స్ట్రిప్స్ కరిగిపోతాయి. ఈ నీటిని పంచదార వేసిన పాలల్లో పోయాలి. పాల మిశ్రమంలో ఒక భాగంలో గ్రీన్ కలర్, మరొక భాగంలో ఆరెంజ్ కలర్, వెనీలా ఎసెన్స్, ఆరెంజ్ ఎసెన్స్ కలపాలి. ఒక భాగంలో ఏ రంగులు కలపకూడదు. ఒక గ్లాస్ బౌల్ తీసుకుని ముందుగా గ్రీన్ కలర్ అగర్ అగర్ మిక్స్ కొద్దిగా పోయాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ భాగం గడ్డ కట్టాక ఏ రంగు కలపని మిశ్రమం పోయాలి. మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. చివరగా గ్రీన్ కలర్ మిక్స్ పోయాలి. మూడూ సమాన భాగాలుగా ఉండే గ్లాస్లో పోసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేయాలి.