మోదీ నమ్మదగిన స్నేహితుడు: డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2020-09-18T21:12:31+05:30 IST

పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సెప్టెంబర్ 17న ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు

మోదీ నమ్మదగిన స్నేహితుడు: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సెప్టెంబర్ 17న ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీని గొప్ప నేతగా, నమ్మదగిన స్నేహితుడిగా ట్రంప్ అభివర్ణించారు. అంతేకాకుండా మోదీ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు. ‘70వ వసంతంలోకి అడుగుపెడుతున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప నేత, నమ్మదగిన స్నేహితుడు మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 




Updated Date - 2020-09-18T21:12:31+05:30 IST