టిక్‌టాక్‌కు 45 రోజుల సమయమిచ్చిన ట్రంప్!?

ABN , First Publish Date - 2020-08-03T21:52:56+05:30 IST

అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌ను దేశంలో

టిక్‌టాక్‌కు 45 రోజుల సమయమిచ్చిన ట్రంప్!?

వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేసేలా ఆర్డర్‌పై సంతకం చేస్తానంటూ గత శుక్రవారం చెప్పారు. ఇదే నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అమెరికా ఆపరేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు అప్పగించేయాలన్న దానిపై పునరాలోచిస్తోంది. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందానికి సంబంధించి బైట్‌డ్యాన్స్‌కు 45 రోజుల సమయం ఇవ్వడానికి ట్రంప్ అంగీకరించినట్టు ఈ విషయంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు చెబుతున్నారు. మరోపక్క టిక్‌టాక్ ఆపరేషన్స్‌ను తీసుకునే దానిపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. సెప్టెంబర్ 15 నాటికి బైట్‌డ్యాన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. పూర్తి భద్రతా సమీక్షకు లోబడి.. ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని తెలిపింది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే మైక్రోసాఫ్ట్ అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఆపరేషన్స్‌ బాధ్యతను తీసుకోనుంది. బాధ్యతలు తమ చేతికి వస్తే అమెరికాలోని వినియోగదారుల ప్రైవేట్ డేటా మొత్తం అమెరికాలోనే ఉంటుందని పేర్కొంది. కాగా.. బైట్‌డ్యాన్స్, మైక్రోసాఫ్ట్ మధ్య చర్చలను అమెరికాలోని విదేశీ పెట్టుబడుల కమిటీ పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ఈ ప్యానెల్‌కు ఏ ఒప్పందాన్ని అయినా నిరోధించే హక్కు కలిగి ఉంటుంది. 

Updated Date - 2020-08-03T21:52:56+05:30 IST