గద్దె దిగే ముందు చైనాకు ట్రంప్ వరుస షాకులు...

ABN , First Publish Date - 2021-01-15T20:01:22+05:30 IST

మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వేదొలగాల్సి ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చైనాకు వరుస షాకులిస్తున్నారు. తాజాగా చైనాకు చెందిన మరికొన్ని కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇది జో బిడెన్‌కు చిక్కులు తీసుకువచ్చే పరిస్థితి ఉంటుందని చెబుతున్నాురు.

గద్దె దిగే ముందు చైనాకు ట్రంప్ వరుస షాకులు...

వాషింగ్టన్ : మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వేదొలగాల్సి ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... చైనాకు వరుస షాకులిస్తున్నారు. తాజాగా చైనాకు చెందిన మరికొన్ని కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇది జో బిడెన్‌కు చిక్కులు తీసుకువచ్చే పరిస్థితి ఉంటుందని చెబుతున్నాురు. మరో ఐదు రోజుల్లో బిడెన్‌కు ట్రంప్ అధికారం అప్పగించనున్న విషయం తెలిసిందే. 


కాగా... ట్రంప్ గతకొద్ది రోజులనుంచే డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. తన ఓటమికి చైనా ప్రధాన కారణంగా ఆయన భావిస్తున్న వ్యాఖ్యానాలు వినవస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన గద్దె దిగడానికి ముందు చైనా కంపెనీలపై మరింత విరుచుకుపడుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దాదాగిరీ చేసినందుకు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. తొమ్మిది చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులను నిషేధించారు. పలువురు కీలక వ్యక్తులపై ఆంక్షలు విధించారు. 


ట్రంప్ నిర్ణయంతో చైనా కంపెనీలకు కీలకమైన టెక్నాలజీ అందడం ఇక మరింత కష్టంగా మారే అవకాశముంది. కిందటిసారి అధ్యక్ష ఎన్నికల సందర్భంలో  చైనా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఒబామా కూడా ఇలాంటి ఆంక్షలే విధించారు. ట్రంప్ ఇప్పుడు అదే వైఖరి కొనసాగించారు.


అందుకే తొలగింపు...

తాజాగా, డ్రాగన్ దేశ ప్రభుత్వరంగ సంస్థ చైనా నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పోరేషన్(సీఎన్ఓఓసీ) దక్షిణ చైనా సముద్రజలాల్లో చమురు అణ్వేషించే పొరుగుదేశాలను వేధిస్తోందని అమెరికా ధ్వజమెత్తింది. వియత్నాం వంటి దేశాలు ఇబ్బందులనెదుర్కొంటున్నట్లు వెల్లడించింది. సముద్ర జలాల్లో పెత్తనం చలాయించడం, కృత్రిమ ద్వీపాల నిర్మాణానికి సహకారం వంటివి చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. 

Updated Date - 2021-01-15T20:01:22+05:30 IST