Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవితాంతం గుర్తుండిపోయేలా భారీ ఓటమిని వాళ్లకు గిఫ్ట్‌గా ఇస్తా.. ట్రంప్ కామెంట్స్

వాషింగ్టన్: ‘నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో నేనే మళ్లీ గెలుస్తా.. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు.. 2016లో హిల్లరీ క్లింటన్‌పై వచ్చిన మెజార్టీ కంటే.. కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలుస్తా.. ప్రత్యర్థులు భయపడే రీతిలో ఊహించనంత ఘోర ఓటమిని వారికి నేను బహుమానంగా ఇస్తా..’.. అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ట్రంప్ తన ప్రచార శైలిని పూర్తిగా మార్చేశారు..గెలుపును నిర్దేశించే రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని.. అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. మాజీ అధ్యక్షుడు ఒబామాను డెమొక్రటిక్ పార్టీ రంగంలోకి దింపడంతో ట్రంప్ తన వ్యాఖ్యలకు మరింత పదును పెంచారు.. 


‘జో బైడెన్, కమలాహారిస్ ద్వయం కనుక పొరపాటను ఈ ఎన్నికల్లో గెలిస్తే వారు ఈ అమెరికాను సోషలిస్ట్ దేశంగా మార్చేస్తారు. భారీ ఓటమిని వారికి బహుమానంగా ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమయింది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఓటమిని వాళ్లు జీవితాంతం గుర్తుండేలా చేయాలి. ఈ అమెరికాను ఎప్పటికీ సోషలిస్ట్ దేశంగా మారనివ్వను.. నేనే గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది.. కొవిడ్ 19 మహమ్మారి వల్ల అస్తవ్యస్తమయిన అమెరికా ఆర్థిక రంగాన్ని ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తీసుకొచ్చా.. ప్రస్తుతం నిరుద్యోగం సింగిల్ డిజిట్‌లోనే ఉంది.. రానున్నవి అన్నీ అమెరికాకు మంచి రోజులే..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను మరోసారి గెలిపించాలని అమెరికన్లను కోరారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement