భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీతో చర్చించాను: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-05-30T12:20:49+05:30 IST

భారత్‌-చైనా సరిహద్దు వివాదం గురించి పక్షం రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను రెండుసార్లు మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదం విషయంలో మోదీ అసంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మోదీ గొప్ప జెంటిల్మన్‌ అని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీతో చర్చించాను: ట్రంప్‌

భారత్‌-చైనా సరిహద్దుపై చర్చించాను: ట్రంప్‌

ఈ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారు

వాషింగ్టన్‌, మే 29: భారత్‌-చైనా సరిహద్దు వివాదం గురించి పక్షం రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను రెండుసార్లు మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదం విషయంలో మోదీ అసంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మోదీ గొప్ప జెంటిల్మన్‌ అని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. వైట్‌హౌస్‌ విలేకరులతో గురువారం నాడు ఓవల్‌ ఎక్స్చేంచ్‌ కార్యాలయంలో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో తాను పర్యటించినపుడు తనకు చాలా ప్రజాదరణ లభించిందని అన్నారు.


అమెరికాలో కన్నా భారత్‌లో జనం తనను ఇంకా ఎక్కువ ఇష్టపడతారని పేర్కొన్నారు. కొవిడ్‌ను తాను జయించానని చెప్పుకొచ్చారు. భారత్‌, చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంపై స్పందిస్తూ ‘ఆ రెండు దేశాలకూ సరిహద్దు సమస్య ఉంది. రెండు దేశాల జనాభా చెరో 1.4 బిలియన్లు. దీంతోపాటు ఇద్దరి వద్దా శక్తిమంతమైన సైన్యం ఉంది. సరిహద్దు వివాదంతో ఇటు భారత్‌ కానీ, అటు చైనా కానీ సంతృప్తిగా లేవు. ఈ విషయంలో నేను మోదీతో మాట్లాడానని మీకు చెప్పగలను’ అని ట్రంప్‌ అన్నారు.

Updated Date - 2020-05-30T12:20:49+05:30 IST