ఫలితాలపై మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన ట్రంప్!

ABN , First Publish Date - 2020-09-30T22:49:07+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ఫలితాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వాఖ్యలు మరో

ఫలితాలపై మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ఫలితాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వాఖ్యలు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇరుపార్టీల అభ్యర్థులు.. మొదటి డిబెట్‌లో పాల్గొన్నారు. పలు అంశాలపై తమతమ వాదనలను వినిపించారు. తొలి ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ఫలితాలపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా? అని అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘కొన్ని నెలల వరకు ఫలితాలు తేలకపోవచ్చు. ఇది సజావుగా ముగియదు’ అని అన్నారు. అంతేకాకుండా ఎన్నికలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన మద్దతుదారులకు సూచించారు. కాగా.. కొద్ది రోజుల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగానే మాట్లాడారు. ఒకవేళ ఎన్నికల్లో తాను ఓడితే.. అంత సులువుగా అధికారాన్ని బదిలీ చేయనన్నారు. అంతేకాకుండా మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకించిన ఆయన.. ఫలితాలు తెలియడానికి నెలలపాటు వేచిచూడాలంటూ వ్యాఖ్యానించారు. తొలి డిబెట్ సందర్భంగా ట్రంప్ మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. జో బైడెన్ మాత్రం ఎన్నికల ఫలితాన్ని అంగీకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.


Updated Date - 2020-09-30T22:49:07+05:30 IST