వెంటిలేటర్లు తయారు చేయండి

ABN , First Publish Date - 2020-03-29T09:31:04+05:30 IST

కరోనాపై పోరాటానికి అమెరికా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. దేశీయ, అంతర్జాతీయ అవసరాలకు సరిపడా వెంటిలేటర్లు సరఫరా చేయడానికి అవసరమైన

వెంటిలేటర్లు తయారు చేయండి

  • జనరల్‌ మోటార్స్‌ సంస్థకు ట్రంప్‌ ఆదేశం

వాషింగ్టన్‌, మార్చి 26: కరోనాపై పోరాటానికి అమెరికా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. దేశీయ, అంతర్జాతీయ అవసరాలకు సరిపడా వెంటిలేటర్లు సరఫరా చేయడానికి అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చుకోవడంలో భాగంగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రక్షణ ఉత్పత్తుల చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం కింద... కార్లను తయారుచేసే జనరల్‌ మోటార్స్‌ కంపెనీని వెంటిలేటర్లు తయారు చేయాలని ఆదేశించారు. మిత్రదేశాలకు భారీ మొత్తంలో వెంటిలేటర్లు సరఫరా చేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. వచ్చే వంద రోజుల్లో లక్ష వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. లక్షాకు పైగా పాజిటివ్‌ కేసులు, 17 వం దల మరణాలతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇం దులో భాగంగా ఇటీవల ప్రకటించిన 2 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై శుక్రవారం సంతకం చేశారు. 

Updated Date - 2020-03-29T09:31:04+05:30 IST