ట్రంప్‌పై నిప్పులు చెరిగిన కమలా హారిస్!

ABN , First Publish Date - 2020-10-22T22:35:15+05:30 IST

అమెరికా ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ హోరాహారీగా ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా.. బుధవారం రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా

ట్రంప్‌పై నిప్పులు చెరిగిన కమలా హారిస్!

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ హోరాహారీగా ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా.. బుధవారం రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. అమెరికా ప్రజలను రక్షించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 80లక్షలు దాటినా.. ట్రంప్‌కు మహమ్మారి తీవ్రతను గుర్తించడం లేదని విమర్శించారు. రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ట్రంపే కారణం అని ఆరోపించారు. వైద్య నిపుణులు చెప్పిన మాటలను ట్రంప్ తెలిగ్గా తీసుకున్నారని.. ఇప్పటికీ అదే విధానాన్ని అనుసరిస్తున్నారని కమలా హారిస్ దుయ్యబట్టారు.


Updated Date - 2020-10-22T22:35:15+05:30 IST